ఇంకా తీస్తూనే ఉన్న పరశురామ్

Family Star

పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఇంతకుముందు “గీత గోవిందం” సినిమా వచ్చింది. అది పెద్ద బ్లాక్ బస్టర్. విజయ్ దేవరకొండని కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసిన మూవీ. ఆ తర్వాత విజయ్ దేవరకొండ పాన్ ఇండియా అంటూ కొన్ని ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇక పరశురామ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సర్కారు వారి పాట” తీసి మళ్ళీ విజయ్ దేవరకొండతో చేతులు కలిపాడు.

ఇప్పుడు వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “ఫ్యామిలీ స్టార్” షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది. కానీ షూటింగ్ కి ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు.

పరశురామ్ ఈ సినిమా విషయంలో కొంచెం పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది. భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో నచ్చని కొన్ని సీన్లను మళ్ళీ తీశాడు. ఇక ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఫైనల్ సీన్లు ఈ వారంలో తీసి గుమ్మడికాయ కొడుతారట.

విడుదలకు నెల రోజుల ముందు కూడా షూటింగ్ చేయడం అనేది పాత కాలపు పద్దతి. పరశురామ్ ఆ పద్దతి నుంచి బయట పడకపోవడం విచిత్రమే.

ఐతే, ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట బాగా హిట్ అయింది. అలాగే ఇటీవల వచ్చిన టీజర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకొంది. ఇక ఇప్పుడు ఇంకో పాటని విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ మాత్రం సాగుతున్నాయి.

Advertisement
 

More

Related Stories