అర్జున్ రెడ్డి దర్శకుడి మూవీలో లేదు

- Advertisement -
Parineeti Chopra

బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు తీస్తున్న కొత్త సినిమా ‘యానిమల్’ నుంచి తప్పుకొంది. ఈ సినిమా బదులు వేరే సినిమా ఒప్పుకొంది. సందీప్ రెడ్డి వంగా తీసిన తొలి చిత్రం … అర్జున్ రెడ్డి. అదొక సంచలనం. అదే చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశారు వంగా. అక్కడ మరింత పెద్ద బ్లాక్ బస్టర్. దాంతో, వంగాకి బాలీవుడ్ లో యమా క్రేజ్ వచ్చింది.

సందీప్ రెడ్డి రెండో బాలీవుడ్ చిత్రం …”యానిమల్”. రణబీర్ కపూర్ హీరో. గతేడాది అట్టహాసంగా ప్రకటించారు. రణబీర్ సరసన పరిణీతి చోప్రాని తీసుకున్నారు. కానీ, ఏడాది తర్వాత కూడా ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఈ ఏడాది చివరలో స్టార్ట్ అయ్యేలా ఉంది.

ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో ఆమె దర్శకుడు ఇంతియాజ్ అలీ తీస్తున్న కొత్త సినిమా ఒప్పుకొంది. దాంతో, “యానిమల్” చిత్రం నుంచి తప్పుకొంది.

ఇప్పుడు, సందీప్ వంగా రణబీర్ సరసన మరో హీరోయిన్ ని తీసుకోవాలి.

 

More

Related Stories