
ప్రభాస్ నటించిన “బాహుబలి” చిత్రంతోనే తెలుగులో రెండు పార్టులుగా సినిమాలు తీయాలనే ట్రెండ్ ఊపందుకొంది. అంతకుముందు రామ్ గోపాల్ వర్మ “రక్తచరిత్ర”తో ఈ పద్దతిని పరిచయం చేశారు తెలుగు ప్రేక్షకులకు. దాన్ని రామ్ గోపాల్ వర్మ సక్సెస్ ఫుల్ గా ట్రెండ్ గా మార్చారు.
“బాహుబలి” సినిమా రెండు భాగాలుగా విడుదలై చరిత్ర సృష్టించింది. ఇప్పుడు “సలార్” మొదటి భాగం తెలుగులో పెద్ద హిట్ గా నిలుస్తోంది. దాంతో రెండో భాగంపై అంచనాలు మొదలయ్యాయి. త్వరలోనే ఈ సినిమా రెండో భాగం “సలార్ 2” స్టార్ట్ అవుతుంది.
ఇక “కల్కి” చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా విడుదల చెయ్యనున్నారు. “కల్కి 2898AD” చిత్రంలో ప్రభాస్, దీపిక పదుకోన్, అమితాబ్ బచ్చన్ నటిస్తుండగా కమల్ హాసన్ విలన్ గా కనిపిస్తారు. కమల్ హాసన్ పాత్ర మొదటి భాగంలో కొంత కనిపించి, రెండో భాగంలో విశ్వరూపం చూపించేలా ఉంటుందట.
ప్రభాస్ – దర్శకుడు సందీప్ వంగా కాంబినేషన్ లో రూపొందే చిత్రం “స్పిరిట్” కూడా రెండు భాగాలుగా ఉంటుందా లేదా అనేది చూడాలి.
ప్రస్తుతానికి ఐతే ప్రభాస్ ఖాతాలో రెండు భాగాల చిత్రాలు మూడు ఉన్నాయి.