సుశాంత్ ఫామ్ హౌజ్ లో డ్రగ్ పార్టీస్?

Sushant Singh Rajput

సుశాంత్ మరణం, అందులో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కోణానికి సంబంధించి ఓ సెక్షన్ నేషనల్ మీడియా ఈరోజు మరో టాపిక్ ఎత్తుకుంది. ఎన్సీబీ అదుపులో ఉన్న రియా చక్రబొర్తి, మరికొన్ని కీలక విషయాల్ని బయటపెట్టినట్టు కొన్ని ఛానెల్స్ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా సుశాంత్ ఫామ్ హౌజ్ లోనే డ్రగ్స్ పార్టీస్ ఎక్కువగా జరిగాయని రియా బయటపెట్టినట్టు నేషనల్ మీడియా చెబుతోంది.

లోనవాలా ఫామ్ హౌజ్ లో సుశాంత్… బాలీవుడ్ స్టార్స్, సెలబ్రిటీస్ కు పార్టీలు ఎక్కువగా ఇచ్చేవాడని.. ఆ పార్టీల్లో డ్రగ్స్ తీసుకునేవారని రియా వెల్లడించిందట. ఎక్కువమంది కొకైన్, ఎల్ఎస్డీ, మారవానా ను తీసుకునేవారని చెప్పుకొచ్చిందట. తను కూడా 2-3 పార్టీలకు హాజరైనట్టు చెప్పిన రియా.. తను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని ఎన్సీబీకి చెప్పిందట.

హీరోయిన్ రకుల్ ప్రీత్ తో పాటు మరో 20 మంది స్టార్స్, సుశాంత్ ఫామ్ హౌజ్ లో మాదకద్రవ్యాలు తీసుకున్నారని రియా చెప్పినట్టు జాతీయ మీడియాలో ఇప్పటికే కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా.. రకుల్ ప్రీత్ ప్రస్తుతం తన నివాసంలో అందుబాటులో లేదని నేషనల్ మీడియా ప్రకటించింది.

ప్రస్తుతం ఈ మేటర్ కు సంబంధించి ఎన్సీబీ (మాదకద్రవ్యాల నిరోధక శాఖ) తీవ్రంగా చర్చిస్తోందట. మరో 2 రోజుల్లో రియా చెప్పిన వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని భావిస్తోందట. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై రకుల్ ఇప్పటివరకు స్పందించలేదు.

Related Stories