పార్టీ సాంగ్ వచ్చేస్తోంది

F3 song

 

పూజా హెగ్డే నుంచి ఇప్పట్లో కొత్త సినిమాలేం రావడం లేదు. ఆమె నటించిన రాధేశ్యామ్, బీస్ట్ సినిమాలు తాజాగా  థియేటర్లలోకి వచ్చేశాయి. అలా సిల్వర్ స్క్రీన్ పై బుట్టబొమ్మ హంగామా తగ్గింది. అయితే పూజా మాత్రం గ్యాప్ ఇవ్వలేదు. త్వరలోనే ఆమె మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి వస్తోంది. అది కూడా ఎఫ్3 సినిమాతో.

ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది పూజాహెగ్డే. సినిమా యూనిట్ మాత్రం దాన్ని పార్టీ సాంగ్ అని పిలుస్తోంది. రీసెంట్ గా ఈ పార్టీ సాంగ్ షూటింగ్ పూర్తయింది. ఇప్పుడా పాటను విడుదల చేయడానికి టైమ్ లాక్ అయింది.

పూజా హెగ్డే పార్టీ సాంగ్ ను మంగళవారం విడుదల చేస్తున్నారు. ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా” అనే లిరిక్స్ తో సాగే ఈ పాట.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవుతుందని యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఈ పాట ప్రోమో రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ .. పర్ఫెక్ట్ పార్టీ పోస్టర్ గా నిలిచింది. పూజా హెగ్డే, వెంకటేష్, వరుణ్ తేజ్‌ జిగేల్ అనిపించే పార్టీవేర్‌లో కనిపించారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ పిట్స్ లో స్పెషల్ పార్టీ సాంగ్ కి తగ్గట్టు మెరిశారు.  

ప్రచారంలో భాగంగా ఎఫ్3 నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన ప్రతి మెటీరియల్ హిట్టయింది. సినిమాపై అంచనాలు 
పెంచింది. ఈ పార్టీ సాంగ్ తో ప్రమోషన్ పీక్ స్టేజ్ కు చేరుకుంటుందని యూనిట్ భావిస్తోంది.

 

More

Related Stories