పతంగుల (గాలిపటాలు) పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు.
నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలోని “హే హలో.. నమస్తే” అంటూ కొనసాగే లిరికల్ వీడియో సాంగ్‌ను శనివారం హైదరబాద్‌లోని పాతబస్తీలో విడుదల చేశారు. ప్రముఖ పాటల రచయిత, ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్, పాపులర్ దర్శకుడు అనుదీప్ కేవీలు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పాటను విడుదల చేశారు.
“నేను ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం ఈ చిత్రం క్రియేటివ్ ప్రొడ్యూసర్ నాని బండ్రెడ్డి. ఆయన ప్రతిభ గురించి నాకు తెలుసు. ఆయన దర్శకత్వం వహించిన చిత్ర కూడా త్వరలో రాబోతుంది. తన దర్శకత్వ అనుభవంతో ఈ సినిమాకు క్రియేటివ్ నిర్మాతగా వున్నాడు. ఈ సినిమా నానికి మంచి పేరును తెచ్చిపెడుతుంది.
అంతేకాదు ఈ చిత్రం అంతా నూతన నటీనటులతో, సాంకేతిక నిపుణులతో ఉన్నతంగా తీర్చిదిద్డబడింది. తప్పకుండా ఈ చిత్రం ఘనవిజయం సాధించి అందరికి మంచి పేరును తీసుకురావాలని ఆశిస్తున్నాను.
అలాగే ఈ చిత్రంలో నటించిన ప్రణవ్ మంచి గాయకుడు, ఈ చిత్రంతో నటుడిగా కూడా మంచి పేరును తీసుకువస్తుంది. మిగతా నటీనటులకు కూడా ఈ సినిమా మైలురాయిగా నిలవాలని కోరుకుంటున్నాను” అన్నారు.