నన్ను వేధిస్తున్నారు: పవిత్ర

Pavitra Lokesh


తెరపై తల్లి పాత్రలు పోషించే పవిత్ర లోకేష్ తన వ్యక్తిగత జీవితం మీడియా లొల్లిగా మారింది. పెళ్లి, ప్రేమాయాణాలతో మీడియాకి హెడ్ లైన్ గా మారారు పవిత్ర లోకేష్. సీనియర్ నటుడు నరేష్ తో ఆమె అనుబంధం గురించే ఈ రచ్చ. నరేష్ నాకు మిత్రుడు మాత్రమే, అంతకుమించి ఏమి లేదని చెప్పిన మర్నాడే పెద్ద గొడవ జరిగింది.

నరేష్ తో కలిసి ఆమె ఒక హోటల్ లో ఉండడం, వారి బంధాన్ని నరేష్ మూడో భార్య రమ్య మీడియా సమక్షంలో బయటపెట్టారు. ఈ గొడవంతా మైసూర్ లో జరిగింది. దాంతో, పవిత్ర మీడియాపై కేసు వేశారు.

కొన్ని మీడియా సంస్థలు, ప్రతినిధులు తనని వేధిస్తున్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్ రూమ్ కి వచ్చి తన పర్సనల్ స్పెస్ లోకి చొరబడ్డారు అనేది ఆమె ఫిర్యాదు. స్టాకింగ్ (వెంటపడడం) కేసుగా పోలీసులు నమోదు చేశారు.

పవిత్ర లోకేష్, నరేష్ తమ పెళ్లి విషయంలో దోబూచులాడుతున్నారు. ఈ మొత్తం గొడవ వల్ల తెరపై ఆంటీ, అంకుల్ గా కనిపించే పవిత్ర, నరేష్ ల ఇమేజ్ దెబ్బతిన్నది.

 

More

Related Stories