పవిత్ర, నరేష్ కనిపిస్తే థియేటర్లో ఈలలు

Pavitra Lokesh and Naresh


పవిత్ర లోకేష్, నరేష్ మధ్య ఉన్న ‘స్నేహం’ గురించి ఇటీవల మీడియాలో చాలా ప్రచారం జరిగింది. అందుకే కాబోలు, వారికి జనం నుంచి ‘మంచి రెస్పాన్స్’ వస్తోంది.

ఈ రోజు విడుదలైన ‘రామారావు ఆన్ డ్యూటీ’లో పవిత్ర రవితేజ తల్లిగా నటించారు. నరేష్ రవితేజకి మామయ్యగా (భార్యకి తండ్రిగా) నటించారు. కొన్ని సన్నివేశాల్లో పవిత్ర, నరేష్ ఒకే ఫ్రేములో కనిపించడంతో థియేటర్లో గొల్లున నవ్వులు. మరికొందరు పవిత్ర కనిపించనప్పుడల్లా ఈలలు వెయ్యడం విశేషం.

పవిత్ర, నరేష్ మధ్య ఉన్న బంధం గురించి మీడియాలో వచ్చిన కథనాలు జనం బాగా ఫాలో అయినట్లు కనిపిస్తోంది.

తనకి విడాకులు ఇవ్వకుండానే వారు ఇద్దరూ అక్రమంగా కలిసి ఉంటున్నారు అని నరేష్ మూడో భార్య రమ్య ఆరోపించారు. మైసూర్ లోని ఒక హోటల్లో నరేష్, పవిత్ర కలిసి బస చేస్తున్నారనే సమాచారంతో వారిని హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ప్రయత్నం చేశారు రమ్య. దాంతో, పెద్ద రచ్చ జరిగింది. మీడియాలో ఆ సంఘటన ఎక్కువగా ప్రసారం అయింది. అందుకే, పవిత్ర, నరేష్ కి ఆ రెస్పాన్స్ ఉంది.

 

More

Related Stories