పవిత్ర పెళ్లిళ్ల గోల: ఆమె కథేంటి?

Pavitra Lokesh


సాధారణంగా ఒక లీడింగ్ హీరోయిన్ గురించి ప్రేమ పుకార్లు పుడుతాయి. అది సహజం. మంచి వయసులో ఉన్న అందాల హీరోయిన్లకు ప్రేమలు, డేటింగులు, బ్రేకప్పులు సహజం. కానీ, హీరోలకు, హీరోయిన్లకు తల్లి పాత్రలు పోషించే నటి ప్రేమ పుకార్లు, పెళ్లి గొడవలు చూడడం చాలా అరుదు. అలాంటి రేర్ నటి పవిత్ర లోకేష్.

ఆమెకి, సీనియర్ నటుడు వీకే నరేష్ కి మధ్య ఉన్న బంధం, అనుబంధం గురించి చాలా గొడవ జరుగుతోంది. వీకే నరేష్ మూడో భార్య రమ్య పవిత్ర, అతను పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఇంతకీ పవిత్ర లోకేష్ నేపథ్యం ఏంటి? ఆమెకి ఎన్ని పెళ్లిళ్లు జరిగాయి. నరేష్ కి ఆమెకి ఎలా పరిచయమో తెలుసుకుందాం…

ఇది తెలుగుసినిమా కామ్ ఎక్స్ క్లూజివ్….

Pavitra Lokesh

పవిత్ర లోకేష్ కి ఇప్పుడు 43 ఏళ్ళు. ఆమె పుట్టింది పెరిగింది సినిమా ఫ్యామిలీలోనే. ఆమె తండ్రి మైసూర్ లోకేష్ కన్నడ సినిమా ఇండస్ట్రీలో పేరొందిన నటుడు. ఆమె సోదరుడు కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఆమె తండ్రి మరణం గురించి కూడా అప్పట్లో చాలా కథనాలు వినిపించాయి.

1994లో ఆమె కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. కానీ, పెద్దగా సక్సెస్ కాలేదు. 2003లో ఆమె తెలుగులోకి అడుగుపెట్టారు సైడ్ క్యారెక్టర్లతో.

ఒక పెళ్లి, ఒక సహజీవనం, ఒక స్నేహబంధం!

ఆమె మొదట ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లాడింది. కానీ వారి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. అతని నుంచి డివోర్స్ తీసుకొని కన్నడ నటుడు, రచయిత సుచెంద్ర ప్రసాద్ తో సహజీవనం మొదలు పెట్టారు. ఒక పదేళ్ల పాటు సాగింది వీరి బంధం. తాజాగా పవిత్ర లోకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం వీరు ఒక ఐదు, ఆరేళ్లుగా కలిసి ఉండడం లేదు. సుచేంద్ర ప్రసాద్ ని పెళ్ళాడలేదు అని కూడా క్లారిటీ ఇచ్చారు.

ఇక తెలుగులో ఆమె క్యారెక్టర్ గా బాగా బిజి కావడం, అదే టైమ్ లో నరేష్ కి భార్యగా పలు సినిమాల్లో నటించడం జరిగింది. ఆ సమయంలోనే వీరి స్నేహబంధం పెనవేసుకొంది. ఆ మధ్య జరిగిన మా ఎన్నికల్లో నరేష్, పవిత్ర కలిసి చేసిన క్యాంపెనింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇటీవల ఒక గుడికి వీరిద్దరూ వెళ్లి కలిసి పూజలు చేశారు. ఇదంతా ‘స్నేహంలో’ భాగమేనట.

తాము పెళ్లి చేసుకోలేదు అంటున్నారు పవిత్ర లోకేష్, నరేష్.

Pavitra Lokesh

నా జీవితం నా ఇష్టం

మరోవైపు, తన తల్లికి, తన అభిమానులకు తప్ప తాను ఎవరికీ సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటోంది పవిత్ర. నరేష్ భార్య రమ్య తమపై బురద జల్లుతోంది కానీ తమ మధ్య ఉన్న బంధం గురించి ఇతరులకు జవాబు చెప్పుకోవాల్సిన పని లేదు కదా అనేది ఆమె వాదన. నా జీవితం నా ఇష్టం అంటున్న పవిత్రకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

 

More

Related Stories