రియల్ లైఫ్ లో స్మోక్ చెయ్యదంట!

Pavitra Lokesh

పవిత్ర లోకేష్ జనరల్ గా పవిత్రమైన పాత్రల్లోనే కనిపిస్తుంది. తెలుగు సినిమాల్లో ఆమె ఎక్కువగా హీరోకో, హీరోయిన్ కో తల్లిగా దర్శనమిస్తుంటుంది. అలాంటి పవిత్ర లోకేష్ ఇటీవల విడుదలైన ‘రెడ్’ సినిమాలో నెగెటివ్ ఛాయలున్న పాత్ర పోషించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ పాత్రలో ఫుల్ గా స్మోక్ చేసింది.

ఇది రెగ్యులర్ ఆడియెన్స్ కి కొంత షాకింగ్ దృశ్యమే. ఎందుకంటే పవిత్ర లోకేష్ ని ఇప్పటివరకు “అలా” ఎవరూ చూడలేదు. దాంతో చాలామందికి ఒక డౌట్ వస్తోంది. రియల్ లైఫ్ లో పవిత్ర ఇంతే “బోల్డ్”గా ఉంటుందా అని. తెరపై పద్దతిగా, సంప్రదాయంగా కనిపించే సురేఖావాణి, ప్రగతి వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇన్ స్టాగ్రామ్ లో వెరీ మాడ్రన్ లైఫ్ స్టయిల్ లో రెచ్చిపోతున్న తీరు చూస్తూనే ఉన్నాం కదా!

ఐతే, ఆమె దీనిపై క్లారిటీ ఇచ్చింది. నిజ జీవితంలో అసలు సిగరెట్ ముట్టుకోను అని చెప్తోంది పవిత్ర లోకేష్. 40 ప్లస్ పవిత్ర ఇటీవలే హైదరాబాద్ కి మకాం మార్చింది. ఏడాది క్రితం వరకు బెంగుళూరులోనే ఉండేది. ఇప్పుడు ఇక్కడికే షిఫ్ట్ అయింది.

More

Related Stories