
పవన్ కళ్యాణ్ మళ్ళీ కొత్తగా రెండు సినిమాలు ఒప్పుకున్నారు అన్న వార్తలు ఆయన ఫ్యాన్స్ కి ఆనందం కలిగించాయి. అందులో ఒక సినిమా… సుజీత్ దర్శకత్వంలో. ఈ సినిమా ప్రకటన చాలా సంచలనం రేపింది. ఇప్పుడు ‘తెరి’ అనే తమిళ్ హిట్ సినిమాకి రీమేక్ గా ఇంకో సినిమాకి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్త.
దాంతో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో గోల గోల మొదలు పెట్టారు. ‘తెరి’ రీమేక్ వద్దు అంటూ హాష్ టాగ్ ట్రెండింగ్ లోకి తెచ్చారు.
“తెరి” అనేది ఎప్పుడో విజయ్ నటించిన తమిళ్ చిత్రం. ఆ సినిమా తెలుగులో ‘పోలీస్’ పేరుతో డబ్ అయింది. కానీ, దాన్ని రీమేక్ చెయ్యాలని చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది అరిగిపోయిన కథ. ఈ టైంలో ఇలా పాత చింతకాయ కథలు, రీమేకులు ఎందుకు అనేది పవన్ కళ్యాన్స్ వేదన, వాదన.
మరి పవన్ కళ్యాణ్ మాట ఏంటో చూడాలి.
త్వరలోనే పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఒకటి సుజీత్ డైరెక్షన్ లో ఒక మూవీ, మరోటి హరీష్ శంకర్ డైరెక్షన్ లో.