పవన్ ఆరోగ్యం కుదుటపడుతోంది

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడుతోంది. ఆయనకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఊపిరితిత్తుల్లో కొంత నిమ్ము చేరడంతో ఆయనకి వైద్యుల ట్రీట్మెంట్ అవసరం అయింది. ఈ వార్త తెలిసిన వెంటనే రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా నిండా పోస్ట్ చేశారు.

“ఇంత అభిమానాన్ని చూపిన వారందరికీ కృతజ్ఞతలు. నా ఆరోగ్యం కుదుటపడుతోంది. వీలైనంత త్వరగా కోలుకొని మీ ముందుకు వస్తా,” అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ప్రభుత్వాలు కూడా కరోనా నివారణలో మరింత సన్నద్ధంగా ఉండాలని సూచించారు.

More

Related Stories