- Advertisement -

“తొలి ప్రేమ”, “యమదొంగ”, “సైనికుడు” వంటి ఎన్నో సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు ఆనంద్ సాయి. ఇప్పుడు ఆయన యాదగిరి గుట్ట టెంపుల్ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఎంతో నిష్టగా… యాదాద్రి గుడి ఆర్కిటెక్ట్ గా శ్రమిస్తున్నారు. సినిమాలు అన్ని పక్కన పెట్టి… పూర్తిగా యాదాద్రి నిర్మాణంలో నిమగ్నం అయ్యారు.
ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆయనకు ఇటీవల ధార్మిక రత్న పురస్కారం దక్కింది. దాంతో ఆనంద సాయిని శాలువాతో సత్కరించారు పవన్ కళ్యాణ్. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయం అన్నారు జన సేనాని.