- Advertisement -

పవన్ కళ్యాణ్ కి ఆవేశం ఎక్కువ. కానీ, తన పథం శాంతియుతం. రాజకీయాలలో ఇదే దారిలో వెళ్తాను అంటున్నారు ఈ జనసేనాని. యుద్ధం చివరి ఆయుధం మాత్రమే అని చెప్తున్నారు.
“ఒక మార్పు కోసం యుద్ధం చెయ్యాల్సి వస్తే తొంభై తొమ్మిదిసార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తా. నూరవసారే యద్ధం చేస్తాను,” అని తాజాగా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. తన జనసేన పార్టీ టెంప్లేట్ లో ఈ కొటేషన్ ని షేర్ చేశారు.
తనపై కక్షగట్టి ‘భీమ్లానాయక్’ సినిమాకి అన్ని అడ్డంకులు సృష్టించిన వై.ఎస్.జగన్ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలా ఉంది. ఇటు సినిమాలు, అటు రాజకీయాలను చేస్తూ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ వార్షికోత్సవం మర్చి 14న. ఈ పదిరోజులు రాజకీయాలపైనే ఆయన దృష్టి ఉంటుంది.
ఈ నెలాఖరులో ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.