పవన్ ని కాపీ కొడుతున్న దిల్ రాజు

- Advertisement -

పవన్ అంటే దిల్ రాజుకు ఇష్టమనే విషయం తెలిసిందే. పవన్ తో సినిమా చేయడానికి దిల్ రాజు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎట్టకేలకు పవన్ రీఎంట్రీ మూవీని నిర్మించే అవకాశం అందుకున్నాడు ఈ బడా ప్రొడ్యూసర్. అయితే ఈ క్రమంలో పవన్ స్టయిల్ ను దిల్ రాజు మక్కికిమక్కి ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.

మొన్నటికిమొన్న ఓ చిన్న సినిమా ఓపెనింగ్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు దిల్ రాజు. ఆ కార్యక్రమంలో దిల్ రాజు ను చూసిన జనాలు పవన్ ను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు (తీన్ మార్ మూవీ టైమ్ లో) పవన్ ఎలాగైతే జీన్స్ ధరించి, టీషర్ట్ ను ఇన్-షర్ట్ చేసేవాడో.. అచ్చం అలాంటి దుస్తులే ధరించి కార్యక్రమానికి వచ్చాడు దిల్ రాజు.

కట్ చేస్తే ఇప్పుడు మరోసారి పవన్ ను అనుకరిస్తూ కనిపించాడు. పవన్-దిల్ రాజు కలిసి హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు. ఆ ఫొటోల్లో పవన్ ఎంతలా ఎట్రాక్ట్ చేశాడో, దిల్ రాజు వేసుకున్న షర్ట్ కూడా పవన్ ఫ్యాన్స్ ను అంతే ఎట్రాక్ట్ చేసింది. ఎందుకంటే, గతంలో పలు సందర్భాల్లో పవన్ సేమ్ డిజైన్ షర్ట్ వేసుకున్నాడు. ఇప్పుడు దిల్ రాజు దాన్ని రిపీట్ చేశాడు. 

ఈ రెండు ఉదంతాలతో పవన్ ను దిల్ రాజు గట్టిగా ఫాలో అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో ఫన్నీ డిస్కషన్ నడుస్తోంది.

 

More

Related Stories