
‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం. అనంతపురంలో బుధవారం (సెప్టెంబర్ 28న) భారీ ఎత్తున జరగనుంది ఈ ఈవెంట్. ఇటీవల కాలంలో చిరంజీవి సినిమా ఫంక్షన్ ఒకటి హైదరాబాద్ అవతల ఇంత పెద్ద ఎత్తున జరగడం ఇదే మొదటిసారి. మరోసారి అభిమానుల్లో జోష్ తీసుకురావాలని చిరంజీవి స్వయంగా ఈ ఫంక్షన్ ప్లాన్ చేశారు.
‘గాడ్ ఫాదర్’కి మెల్లగా ప్రచారం పైస్థాయికి వెళ్తోంది. ఐతే, అభిమానులకు మరింత ఊపు రావాలంటే ఈ ఫంక్షన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పిలవాలని మెగాస్టార్ టీం సలహాలు ఇచ్చింది. ఈ సినిమా కథ కూడా రాజకీయాల చుట్టే తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత. ఇలాంటి సినిమాకి పవర్ స్టార్ అతిథిగా వస్తే సినిమా థీమ్ కి సరిపోతుంది సరిగ్గా.
కానీ, పిలుద్దామంటే పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరు. ఆయన ఇటీవలే విదేశాలకు వెళ్లారు స్వంత పనుల మీద. తిరిగి ఎప్పుడు వస్తారో తెలియదు.
అందుకే, సరైన టైములో పవన్ కళ్యాణ్ తప్పించుకున్నారే అనే మాట అనిపిస్తోంది.