
షూటింగ్ లతో హీరో బిజీ అయిపోయారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన బిజీగా ఉంటూనే ఒప్పుకున్న అన్ని సినిమాలు పూర్తి చెయ్యాలని ఆయన పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఒక్క నెలలోనే ఆయన “వినోదయ సితం” రీమేక్ చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. ఇక “ఉస్తాద్ భగత్ సింగ్”, “ఓజి”, “హరిహర వీరమల్లు”, షూటింగ్ లు కూడా మొదలవుతున్నాయి. “ఉస్తాద్ భగత్ సింగ్” వచ్చేనెల మొదలవుతుంది. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకుడు. ఇక “హరిహర వీరమల్లు” షూటింగ్ కూడా మిగిలిన షూటింగ్ భాగాన్ని పూర్తి చేసుకుంటుంది. మే నెలలో “ఓజి” సినిమా షురూ. ఈ సినిమాకి సుజీత్ దర్శకుడు.
ఐతే, ఇందులో రెండు చిత్రాలు మాత్రమే 2023లో విడుదల అవుతాయి. “వినోదయ సితం రీమేక్” చిత్రం ఈ ఏడాది జులై 28న విడుదల అవుతుంది. “హరి హర వీరమల్లు” చిత్రానికి ఇంకా డేట్ ఖరారు కాలేదు.
“ఉస్తాద్”, “ఓజి” చిత్రాలు 2024లో ఎన్నికలు ముగిసిన తర్వాత విడుదల అవుతాయి.