
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు ఆయన స్థానిక ఎన్నికల్లో ఓటేయ్యలేదు. ఇదే ఫస్ట్ టైం. విజయవాడ పటమటలోని కొమ్మ సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికల పాఠశాల్లో ఏర్పాటుచేసిన పోలింగు బూతుకి వెళ్లి ఓటు వేశారు పవన్ కళ్యాణ్.
మున్సిపల్ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదు అవుతోంది.
2014 వరకు ఆయన హైదరాబాద్ లో ఓటు వేసేవారు. రాష్ట్రం విడిపోయాక… పవన్ కళ్యాణ్ తన ఓటుని, అడ్రస్ ని విజయవాడకి మార్చారు. హైదరాబాద్ లో కేవలం షూటింగ్ ల కోసమే నివాసం. రాజకీయ పోరాటం అంతా ఆంధ్రప్రదేశ్ లోనే. పవన్ కళ్యాణ్ కి చెందిన జనసేన పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా ఉంది.