
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి తన వంతుగా నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విరాళం ప్రకటించారు. 30 లక్షల రూపాయలను అందించనున్నారు పవన్ కళ్యాణ్. శుక్రవారం ఆయన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఏడాది కాలంగా తిరుపతికి రావాలని అనుకుంటున్నా… కరోనా కారణంగా కుదరలేదని అన్నారు పవన్ కళ్యాణ్.
శ్రీవారి సేవ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. రామ్ మందిర్ నిర్మాణానికి 30 లేఖలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
త్వరలోనే తిరుపతి లోక్ సభ సీటుకు ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో జనసేన తరపున అభ్యర్థిని నిలపాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నా మిత్రపక్షం బీజేపీ ఒప్పుకోవడం లేదు. బీజేపీ అభ్యర్థి నిలబడడం ఖాయం. ఐతే, కాండిడేట్ తమ పార్టీ వారు కాకపోయినా…. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసేందుకు రెడీ. ఈ రోజు ఆయన ఇన్ డైరెక్ట్ గా తిరుపతి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినట్లే.