విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ఫైర్

- Advertisement -

విజయ్ దేవరకొండపై ట్రోలింగ్స్ కొత్తేంకాదు. కానీ పవన్ ఫ్యాన్స్ ఇప్పటివరకు విజయ్ దేవరకొండపై ఫైర్ అవ్వలేదు. మెగా కాంపౌండ్ కు అతడు దగ్గరగా ఉండడమే దీనికి కారణం. అయితే తొలిసారి పవన్ ఫ్యాన్స్ అగ్రహానికి గురయ్యాడు దేవరకొండ. దీనికి కారణం, పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ ను అతడు వాడేయడమే.

శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ పెట్టారు. నిన్న మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఖుషి అంటే పవన్ కల్యాణ్, పవన్ కల్యాణ్ అంటే ఖుషి. ఈ విషయం అందరికీ తెలిసిందే. పవన్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే కల్ట్ మూవీస్ లో ఒకటి ఖుషి.

అలాంటి సినిమా టైటిల్ ను విజయ్ దేవరకొండ తన సినిమా కోసం వాడేయడంతో పవన్ ఫ్యాన్స్ అగ్రహానికి గురయ్యారు. సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండపై ట్రోలింగ్ షురూ చేశారు. అర్జెంట్ గా టైటిల్ మార్చమని డిమాండ్ చేశారు. ఇదే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంతకు కూడా ఈ ట్రోలింగ్ సెగ తప్పలేదు.

కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో అందమైన ప్రేమకథగా తెరకెక్కుతోంది ఖుషి. ఈ సినిమా కోసం డిఫరెంట్ కాన్సెప్ట్, స్టోరీ సెలక్ట్ చేసుకున్నాడు శివ నిర్వాణ. కథకు తగ్గట్టు ఖుషి అనే టైటిల్ పెట్టుకున్నారు. నిజానికి కల్ట్ సినిమా టైటిల్స్ వాడేయడం ఇదే తొలిసారి కాదు. మాయాబజార్, మిస్సమ్మ లాంటి సినిమా టైటిల్స్ నే వాడేశారు. ఇప్పుడు ఖుషి టైటిల్ వాడేస్తున్నారంతే.

 

More

Related Stories