పవన్ సినిమాలు… రోజుకో వార్త!

Pawan Kalyan


పవన్ కళ్యాణ్ సినిమాల గురించి రోజుకో వార్తని రాస్తున్నాయి వెబ్ సైట్ లు. ముహుర్తాలు అంటూ, రెగ్యులర్ షూటింగ్ అంటూ రకరకాల వార్తలు. ప్రధానంగా మూడు సినిమాల గురించి ప్రచారం జరుగుతోంది. అవి – వినోదయ సితం రీమేక్, హరీష్ శంకర్ – మైత్రి మూవీ సినిమా, దానయ్య – సుజిత్ సినిమా.

ఇందులో ‘వినోదయ సితం’, హరీష్ శంకర్ – మైత్రి సినిమా ఎప్పటి నుంచో నలుగుతున్నవే. సముద్రఖని డైరెక్షన్ లో ‘వినోదయ సితం’ రీమేక్ కి సంబంధించి పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు అనేది ఇంకా తేలలేదు. ఇక హరీష్ శంకర్ అనుకున్న కథ విషయంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా కన్విన్స్ కాలేదు. దాంతో, “భవదీయుడు భగత్ సింగ్” అనే పేరుతో అనౌన్స్ చేసిన సినిమా ఇప్పటివరకు ప్రారంభం కాలేదు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ సినిమా పూర్తి చేసే పనిపైనే ఫోకస్ నిలిపారు. ఈ ఏడాది చివర్లోపు కీలకమైన భాగం మొత్తం పూర్తి చెయ్యాలని పట్టుదలగా ఉన్నారు. మిగతా భాగాన్ని జనవరి, ఫిబ్రవరిలో కంప్లీట్ చేసేస్తే సినిమా పూర్తి అవుతుంది.

ఆ తర్వాత మిగతా సినిమాల ప్రారంభం ఉంటుంది. ఈ గ్యాప్ లో పూజలో, ప్రారంభోత్సవాలో ఉంటే ఉంటాయి. ఇంతకుమించి ఈ సినిమాల విషయంలో హడావిడి లేదని టాక్.

 

More

Related Stories