
పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు హరీష్ శంకర్ తీసే సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్న విషయంలో కూడా స్పష్టత వచ్చింది. ఒక సినిమా పూర్తి చేసిన తర్వాతే ఇంకోటి షురూ అవుతుంది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన భాగం త్వరలోనే పూర్తి అవుతుంది. అది అయిపోయిన వెంటనే… ఇప్పటికే సగం తీసి ఆపిన ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని మొదలు పెడతారట. ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలనేది ప్లాన్. “ఆర్ ఆర్ ఆర్” సినిమా వచ్చి డిస్టర్బ్ చెయ్యకపోతే… జనవరి 12న విడుదల కావడం ఖాయం.
ఇక 2022 సమ్మర్ కానుకగా క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న “హరి హర వీరమల్లు” విడుదల అవుతుంది. 2023 సంక్రాంతికి హరీష్ శంకర్ సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ పూర్తి కాగానే హరీష్ మూవీ స్టార్ట్ అవుతుందట.
పవన్ కళ్యాణ్ దర్శకుడు సురేందర్ రెడ్డి మూవీ కూడా చేస్తానని మాటిచ్చారు. కానీ ముందుగా ‘భీమ్లా నాయక్’, ‘హరి హర వీరమల్లు’ చిత్రాలు పూర్తి చేసి హరీష్ మూవీ స్టార్ట్ చెయ్యడమే ఆయన ప్రియారిటి. ఈ మూడు సినిమాల విషయంలో ఇక కన్ఫ్యూజన్ లేదు.