- Advertisement -

జనసేనాని పవన్ కళ్యాణ్ జుట్టు పెంచుతున్నారు. గడ్డం ట్రిమ్ చేసుకున్నారు కానీ జుట్టు మాత్రం పెంచుతున్నారు. దానికో కారణం ఉంది.
వచ్చే నెల నుంచి పవన్ కళ్యణ్ షూటింగ్ లో పాల్గొంటారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న “హరి హర వీరమల్లు” షూటింగ్ ఏడాది తర్వాత మొదలవుతోంది. గతేడాది జనవరిలో షూటింగ్ ఆగింది. 13 నెలల తర్వాత మళ్ళీ షూటింగ్ షురూ కానుంది. ఈ పాత్ర కోసం పొడవాటి హెయిర్ స్టయిల్ తో కనిపిస్తారు పవన్ కళ్యాణ్. అందుకే, ఇప్పుడు ఆ హెయిర్ ని ట్రిమ్ చేసుకోవడం లేదు.
ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మార్చారు. తెలుగుతో పాటు హిందీలో కూడా కూడా విడుదల అవుతుంది. ఎం.ఎం.కీరవాణి హిందీ పాటలను బాలీవుడ్ సింగర్స్ తో పాడిస్తున్నారు.
భారీ సెట్స్, గ్రాఫిక్స్ తెరకెక్కే “హరి హర వీరమల్లు” ఈ ఏడాదే విడుదల అయ్యే అవకాశం ఉంది.