
పవన్ కల్యాణ్ ఇంకా వైరల్ ఫీవర్ నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఆయన నీరసం, దగ్గుతో బాధపడుతున్నారట. ప్రస్తుతం ఆయన ఇంటిపట్టునే ఉంటున్నారు. మరో వారం పాటు విశ్రాంతి అవసరం.
మరోవైపు, పవన్ కల్యాణ్ గండిపేటలో ఫార్మ్ హౌజ్ కట్టిస్తున్నాడని, ప్రతి రోజూ అక్కడికి వెళ్లి వస్తున్నాడని కొన్ని వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదనేది సమాచారం. ఆయన రాజకేయ యాత్రలు, మీటింగులు మరో వారం తర్వాత కొనసాగుతాయి.
పవర్ స్టార్ చెయ్యాల్సిన రెండు చిత్రాలకు సంబంధించి నిర్ణయం గిల్డ్ పై ఆధారపడింది. రేపటి నుంచి (ఆగస్టు 1) షూటింగులు అన్నీ బంద్. మళ్ళీ షూటింగులు మొదలయ్యాక ‘హరి హర వీర మల్లు’ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టాలనేది నిర్ణయం తీసుకుంటారట. ఈ సినిమాతో పాటు ‘వినోదయ సితం’ సినిమా షూటింగ్ కూడా ఉంటుంది. ఈ రెండు సినిమాలు పూర్తి చేస్తారు పవన్ కల్యాణ్.
మిగతా సినిమాలేవీ ఇప్పట్లో ఉండవు. 2023 నుంచి ఆయన ఫోకస్ పూర్తిగా రాజకీయమే.