ట్వీట్లు కాదు ఓట్లు వేయండి!

senani birthdaycdp

సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంత యాక్టివ్ గా ఉంటారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసారి కూడా పవనిజం అంటే ఏంటో మరోసారి రుచిచూపించారు అభిమానులు. ఏకంగా పవన్ పేరిట ఓ వరల్డ్ రికార్డ్ సృష్టించారు.

హీరోల కోసం ట్విట్టర్ లో ట్రెండ్స్ సృష్టించడం ఈమధ్య కామన్ అయింది. ఇప్పుడు అదే సెగ్మెంట్ లో పవన్ పేరిట వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు ఫ్యాన్స్. #PawanKalyanBirthdayCDP అనే హ్యాష్ ట్యాగ్ ను వరల్డ్ వైడ్ ట్రెండ్ చేసి తమ సత్తా చాటారు. ప్రపంచంలోనే అత్యథిక ట్వీట్లు కలిగిన హ్యాష్ ట్యాగ్ గా ఇది రికార్డ్ సృష్టించింది. కేవలం 23 గంటల 12 నిమిషాల్లో 60.3 మిలియన్ ట్వీట్స్ వేసి ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ ను సెట్ చేశారు ఫ్యాన్స్. అలా పుట్టినరోజుకు ముందే తమ హీరోకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.

కేవలం కామన్ డీపీతో క్రియేట్ చేసిన రికార్డ్ ఇది. ఇక పుట్టినరోజు నాడు, సెప్టెంబర్ 2న ఇంకెంత పెద్ద రికార్డ్ క్రియేట్ అవుతుందో చూడాలి.

అంతా బానే ఉంది కానీ… పవన్ కళ్యాణ్ కి ఈ టైంలో కావాల్సింది ట్వీట్లు కాదు… ఓట్లు. సోషల్ మీడియాలో బాగానే హడావిడి చేస్తారు కానీ నిజంగా ఆయన బలం చాటుకుందామనుకునే టైములో మాత్రం ఈ అభిమానం చాలడం లేదు. సోషల్ మిడియా రికార్డులు కాదు ఎన్నికల్లో గెలవడం ఆయనకీ ఇంపార్టెంట్. మరి అభిమానులు ఆ దిశగా ప్రయత్నిస్తే బెటర్.

Related Stories