‘బాలు త్వరగా కోలుకోవాలి’

- Advertisement -
SP Balu

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి మెరుగుపడింది. రెండు రోజులుగా ఐసీయూ లో ఇస్తున్న ట్రీట్మెంట్ కి అయన బాడీ బాగా రెస్పొండ్ అవుతోందని డాక్టర్స్ తెలిపారు. మరోవైపు జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన కోలుకొని మళ్ళీ మన ముందుకు రావాలని కోరారు.

“బాలు గారు ఎంతో స్థైర్యం ఉన్నవారు. ఆయన ప్రస్తుత అనారోగ్య స్థితి నుంచి వీలైనంత త్వరగా కోలుకొని మన ముందుకు వస్తారనే విశ్వాసం ఉంది. చెన్నైలో లైఫ్ సపోర్ట్ తో ఉన్నారు అని నిన్నటి రోజున తెలియగానే ఆత్మస్థైర్యం నిండుగా ఉన్న ఆయన తప్పకుండా కోలుకొంటారని భావించాను. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఊరటనిచ్చే వార్త ఇది. మా కుటుంబానికి శ్రీ బాలు గారు ఎంతో సన్నిహితులు. వారు ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను,” అని ఒక ప్రకటనలో తెలిపారు.

 

More

Related Stories