పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా!


ఊహించినట్లుగానే పవన్ కళ్యాణ్ ని నందమూరి బాలకృష్ణ పెళ్లిళ్ల గురించి అడిగారు. ‘అన్ స్టాపబుల్ షో’ కొత్త సీజన్ చివరి గెస్ట్ గా పవన్ కళ్యాణ్ విచ్చేశారు . ఈ ఎపిసోడ్ ప్రోమో బయటికి వచ్చింది.

“ఈ పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా?” అని బాలయ్య సూటిగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి అడిగేశారు. ఐతే, ఇది ప్రోమో కాబట్టి ఆయన సమాధానం ఏంటో తెలియదు. ఇన్ సైడ్ సమాచారం ప్రకారం… తాను మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో ఎమోషనల్ గా పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారట. ఇకపై ఎవరూ ఆయన పెళ్లిళ్ల గురించి పాలిటిక్స్ చెయ్యకూదడదు అని చివర్లో బాలయ్య హితబోధ కూడా చేసినట్లు సమాచారం.

ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మేటర్ తప్ప మిగతా అంతా పస లేని ఇంటర్వ్యూ అని టాక్.

పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోవడం వంటి విషయాలు ఉన్నా అందులో కూడా పెద్దగా మేటర్ లేదంట.

 

More

Related Stories