
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు అరెస్ట్ తో హుటాహుటిన విజయవాడ వెళ్లిన పవన్ కళ్యాణ్ రెండు రోజుల తరువాత హైదరాబాద్ కి విచ్చేశారు. పవన్ కళ్యాణ్ ముందు ఒప్పుకున్న “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ షెడ్యూల్ చేసేందుకు హైదరాబాద్ వచ్చారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై ఒక భారీ యాక్షన్ సీన్ తీస్తున్నారు. రామ్ లక్ష్మణ్ అధ్వర్యంలో ఈ భారీ ఫైట్ ని తీస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కి చెందిన సొంత స్థలంలో వేసిన దేవాలయం సెట్ లో ఈ ఫైట్ ని చిత్రీకరిస్తున్నారు.
ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాకే మళ్ళీ పవన్ కళ్యాణ్ మంగళగిరి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు, దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తిరిగి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల అంతా పవన్ కల్యాణ్ విజయవాడలోనే ఉంటారు అని ప్రచారం జరిగింది. దాంతో, “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ మరోసారి ఆగినట్లే అని అందరూ అనుకున్నారు.
ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ సీన్ కాకుండా ఇంతకుముందు కేవలం ఒక్క ఎపిసోడ్ మాత్రం చిత్రీకరించారు. అంటే, ఇంకా ఆరు నెలలకు పైగా షూటింగ్ జరగాలి. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.