రాముడు మన హీరో: పవన్ కళ్యాణ్

Pawan Kalyan

శ్రీరాముడు భారతీయ నాగరికతకు హీరో అని అంటున్నారు సినిమా హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆయన శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అయోధ్య వెళ్లారు. ఎయిర్ పోర్టు నుంచి అయోధ్యకు వెళ్తుండగా కారులో నుంచి ట్వీట్ చేశారు.

Advertisement

రాముడు భజనలు వింటూ తాదాత్య్మకతలో ఉన్న తన వీడియోని షేర్ చేశారు.

“అయోధ్యకు వెళ్లే మార్గంలో… ‘రాముడి ప్రాణ ప్రతిష్ట..’ సాక్షిగా… రాముడు ‘మన భారత నాగరికత వీరుడు.’ ఇంకా శ్రీరాముడిని ‘అయోధ్యలోకి’ తిరిగి తీసుకురావడానికి ఐదు శతాబ్దాల పోరాటం పట్టింది. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీ రామ్ !,” అని తన పోస్టులో పెట్టారు.

పవన్ కళ్యాణ్ కి భక్తి ఎక్కువే. ఆయన చాలా కాలంగా బీజేపీతో ప్రయాణిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కూడా బీజేపీకి మిత్రపక్షం. దాంతో, పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ఆహ్వనం అందింది.

త్వరలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే, గత ఐదు నెలల నుంచి ఆయన సినిమా షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు. మరో నాలుగు నెలలు అంతే. ఆ తర్వాతే “ఓజీ”, “ఉస్తాద్ భగత్ సింగ్”, “హరి హర వీరమల్లు” చిత్రాల గురించి ఆలోచిస్తారు.

Advertisement
 

More

Related Stories