పవన్ షూటింగ్ జోరు

Hari Hara Veeramallu

చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ జోరుగా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ‘హరి హర వీర మల్లు’ చిత్రం సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ నిరాటంకంగా సాగుతోంది. ఈ సినిమా పూర్తి చేస్తే పవన్ కళ్యాణ్ చాలా వరకు ఫ్రీ అవుతారు. భారీ ఖర్చుతో తీస్తున్న పీరియడ్ చిత్రమిది. అల్లాటప్పాగా చిత్రీకరించే సినిమా కాదు. అందుకే, ఇన్నేళ్లు పడుతోంది ఈ సినిమా పూర్తి చేసేందుకు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రమం తప్పకుండా షూటింగ్ కి వస్తుండడంతో దర్శకుడు క్రిష్ ఆనందంగా ఉన్నాడు. ఇదే స్పీడ్ కంటిన్యూ ఐతే అనుకున్న టైంకి షూటింగ్ మొత్తం పూర్తిచేస్తాను అని ధీమాగా ఉన్నాడు.

‘హరి హర వీర మల్లు’ చిత్రం ప్రారంభమై రెండున్నరేళ్లు అవుతోంది. పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రలకు, కార్యకలాపాలకు ఎక్కువ గ్యాప్ తీసుకోకపోతే రెండు నెలల్లో పూర్తి అవుతుంది. ఐతే, పవన్ కళ్యాణ్ ఇటీవల ఎక్కువగా రాజకీయ వ్యవహారాలతోనే బిజీగా ఉంటున్నారు. ఖాళీ దొరికినప్పుడే ఈ షూటింగ్ చేస్తున్నారు. అందుకే, ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుంది అనే విషయంలో ఎవరూ చెప్పలేక పోతున్నారు.

అంతే కాదు, ముందు అనుకున్న విలన్ అర్జున్ రాంపాల్ కూడా మారిపోయాడు. అతను ఇచ్చిన డేట్స్ మురిగిపోయాయి. ఇప్పుడు అతని స్థానంలో మరో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ వస్తున్నారు.

 

More

Related Stories