
పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడుతారు. ప్రత్యర్థులకు గట్టిగానే సమాధానం ఇస్తారు. ఐతే, మొదటిసారి ఆయన చెప్పు తీశారు.
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నాయకులు చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ని ప్యాకేజ్ స్టార్ అని విమర్శలు చేస్తున్నారు. దాంతో, ఇకపై ఎవరైనా అలా అంటే చెప్పుతో కొడుతానంటూ చేతిలోకి చెప్పు తీసుకున్నారు పవన్ కళ్యాణ్.
“ప్యాకేజీ స్టార్ అనే ఒక్కొక్క వైసీపీ నాకొడుకులకి చెప్తున్న…. ఇంకొక్క సారి ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతా వైసీపీ నాకొడకల్లారా….” అంటూ పవన్ కళ్యాణ్ రెచ్చిపోయారు. పవన్ తన కాలికి ఉన్న చెప్పు తీసి మరీ చూపించడంతో ఇది ఈ రోజు హాట్ టాపిక్ అయింది.
గత మూడు నాలుగేళ్లలో 100 కోట్లు సినిమాల ద్వారా సంపాదించాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ తాను డబ్బుకు అమ్ముడుపోయే వాడిని కాదని ఘాటుగా సమాధానం ఇచ్చారు. అలాగే, తాను కూడా గొడ్డు కారం తిన్నానని, తనకు కూడా పౌరుషం ఉందని, తనకి కూడా బూతులు తిట్టడం వచ్చని గట్టిగా కౌంటర్ ఇచ్చారు.