- Advertisement -

పవన్ కళ్యాణ్ కి తాజా కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. గతవారం వకీల్ సాబ్’ విడుదల కాగానే పవన్ కళ్యాణ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు.
‘వకీల్ సాబ్’ సినిమా టీంకి చెందిన దిల్ రాజు, హీరోయిన్ నివేథా థామస్ తో పాటు పలువురు మెంబర్స్ కరోనా బాధితులుగా నిలిచారు. అలాగే, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది, జనసేన పార్టీకి చెందిన కీలకమైన వ్యక్తులకి కూడా కరోనా వచ్చింది. దాంతో డాక్టర్ల సలహా ప్రకారం పవన్ కళ్యాణ్ ఐదు రోజుల పాటు ఐసోలేషన్ కి వెళ్లారు.
తాజాగా ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకున్నారు. ఆయనకి తాజాగా అని తేలింది. పవన్ కళ్యాణ్ తన నిర్మాత నాగవంశీతో కలిసి టెస్ట్ కి వెళ్లారు. నాగవంశీ నిర్మిస్తున్న ‘అయ్యపనం కోసిహియుమ్’ రీమేక్ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో. ప్రస్తుటానికి ఆయన ఇంటివద్దే ఉండి చికిత్స తీసుకోనున్నారు.