థాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్

- Advertisement -
Pawan Kalyan

పవన్ కల్యాణ్ తన 50వ పుట్టిన రోజుని సింపుల్ గానే జరుపుకున్నారు. కానీ, ఆయన అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో హంగామా చేశారు సెలబ్రిటీల నుంచి సామాన్య జనం వరకు పవన్ కళ్యాణ్ ని శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఈ రోజు అంతా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ట్రేండింగ్ టాపిక్ అయింది.

తనపై ఇంతటి అభిమానాన్ని చూపిన వారందరికీ జనసేనాని ప్రత్యేకంగా థాంక్స్ తెలిపారు. ఆయన రాసిన లెటర్…

“నా చుట్టూ ఉన్న సమాజం ఎల్లవేళలా క్షేమంగా ఉండాలనే భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాను. యేడాదిన్నర కాలంగా దేశం కరోనా మహమ్మారితో పోరాడుతూనే ఉంది. సెకండ్ వేవ్ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. కష్ట జీవుల జీవనం ఇంకా గాడినపడలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో జన్మదిన శుభాకాంక్షలు అందుకోలేను అనే ఉద్దేశంతో దైవ చింతనలో గడిపాను. సహజంగానే నేను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటానని నన్ను అభిమానించేవారికి తెలుసు.

నాపై ఉన్న అపార ప్రేమాభిమానాలతో ఎందరో హితైషులు, సన్మిత్రులు, శ్రేయోభిలాషులు, సమాజ సేవకులు, రాజకీయ నేతలు, సినీ తారలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, మీడియా ప్రతినిధులు, ప్రవాస భారతీయులు, నన్ను తమలో ఒకడిగా భావించే అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు అందచేశారు. జనసేన శ్రేణులు, అభిమానులు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని సేవామార్గంలో వెల్లడించారు. పెద్దలు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు శుభాశీస్సులు అందించారు.

ప్రతి ఒక్కరూ ఎంతో వాత్సల్యంతో నాకు శుభాకాంక్షలు అందించారు. వెల కట్టలేని ఈ అభిమానానికి, వాత్సల్యానికి నేను సర్వదా కృతజ్ఞుడిని. అందరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.”

 

More

Related Stories