
పవన్ కళ్యాణ్, బీజేపీ మిత్రపక్షాలుగా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ వీక్ కావడంతో ఏర్పడిన వాక్యూమ్ ని తాము భర్తీ చెయ్యాలనేది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎత్తుగడ.
అందుకే గత ఎన్నికల్లో సీట్లు రాకపోయినా, పవన్ కళ్యాణ్ రాజకీయనేతగా మొదటి అటెంప్ట్ లో ఫెయిల్ అయినా… జనసేన పార్టీతో చేతులు కలిపింది బీజేపీ. ఐతే, త్వరలోనే పవన్ కళ్యాణ్ ని కేంద్రమంత్రి పదవి దక్కనుందని, ఆయనకి ఒక మంత్రి పదవి ఇవ్వడం ద్వారా వచ్చే పవర్ తో ఆంధ్రాలో కొత్త రాజకీయం చెయ్యాలని బీజేపీ యోచిస్తోందా?
ఐతే, ఇదంతా పుకారు అనే మాట కూడా బలంగా వినిపిస్తోంది. బీజేపీకికేంద్రంలో ఓవర్ మెజార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఐతే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కొన్ని కామెంట్స్ వల్ల ఇలాంటి పుకార్లు పుట్టి ఉంటాయి.
“పవన్ కళ్యాణ్, మోడీ ఇద్దరి ఆలోచనల్లో సారూప్యత ఉంది. పవన్ కళ్యాణ్ తో మాది బలమైన దోస్తీ. ఐతే, ఆయనకీ కేంద్రంలో మంచి స్తానం ఇస్తామా, లేక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామా అనేది బయటికి ఎలా చెపుతాం. మా పార్టీ పెద్దలు చెప్పిందాన్ని ఫాలో అవుతా,”మని కామెంట్ చేసారు సోము వీర్రాజు. ఆయన స్టేట్మెంట్ ని అభిమానులు రకరకాలుగా ఊహించుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ టార్గెట్… 2024 ఎన్నికలు. మరో రెండేళ్ల పాటు సినిమాలు చేసి… ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ నిలపాలని అనుకుంటున్నారు. అందుకే మూడు, నాలుగు సినిమాలను లైన్ లో పెడుతున్నారు. మరి ఈ గ్యాప్ లో మంత్రి పదవి అనేది ఉత్తిమాటే.