
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్నారు. కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటివరకు ప్రచారానికి దూరంగా ఉన్నారు. దాంతో, విమర్శలు వచ్చాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు.
జనసేన, బీజేపీ కలిసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. సో, తమ పార్టీ అభ్యర్థులతో పాటు బీజేపీ అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేసేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారు. రేపటి నుంచి (బుధవారం) పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూల్ మొదలవుతుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికు మద్దతుగా ప్రచారం చేస్తారు. అలా క్యాంపెయినింగ్ కి శ్రీకారం చుడుతున్నారు.
తాండూరు, కూకట్ పల్లిల్లో జనసేన పార్టీ అభ్యర్థల తరఫున కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అలాగే ప్రధాని మోదీ కూడా హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించనున్నారు. అనేక సభల్లో పాల్గొంటున్నారు. ప్రధానితో కొన్ని సభల్లో పవన్ కూడా పాల్గొంటారని సమాచారం.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ షూటింగ్ లకు, సినిమా కలాపాలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా రాజకీయాలపైన ఆయన ఫోకస్ ఉంది.