- Advertisement -

మొత్తానికి పవన్ కళ్యాణ్ సస్పెన్స్ కి తెరదించారు. ఆయన ఎన్నికల ప్రచారానికి డేట్ ఫిక్స్ అయింది. తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేసేందుకు ఒప్పుకోవడం విశేషం.
పవన్ కళ్యాణ్ ని గౌరవించాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీ వారికి హితబోధ చేసిన తర్వాత పవన్ కల్యాణ్ ఓ మెట్టు దిగారు. తనని కరివేపాకులా వాడుకొని వదిలేస్తామంటే కుదరదని పవన్ కళ్యాణ్ గట్టి సిగ్నల్స్ వచ్చాక… బీజేపీ దిగివచ్చింది.
ఏప్రిల్ 3న పవన్ కళ్యాణ్ ప్రచారం ఉంటుంది. తిరుపతిలోని ఎమ్.ఆర్.పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పాదయాత్ర చేస్తారని జనసేన పార్టీ తెలిపింది. అలాగే, శంకరంబాడి సర్కిల్ లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారట.