- Advertisement -

పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేస్తే రెండు చోట్లా ఓడిపోయారు. గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీచేశారు. పవన్ కళ్యాణ్ కి ఆ ఏరియాల్లో ఉన్న క్రేజ్ అట్లాంటి క్రేజ్ కాదు. అయినా ఓడిపోయారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాలకొల్లులో ఓడిపోయారు.
ఈ అనుభవాల దృష్ట్యా ఈసారి గోదావరి జిల్లా నుంచి పోటీ చేయొద్దు అని పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు చెప్పారట. ఈ సారి తిరుపతి నుంచి పోటీ చెయ్యాలని చెప్తున్నారట.
ఐతే, పవన్ కళ్యాణ్ ఈ సారి కూడా రెండు చోట్లా పోటీ చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో, ఇటు పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మార్చిలో జరుగుతాయి.