
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరి హర వీర మల్లు’ ఆగిపోయిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన హరీష్ శంకర్ తీయాలన్న ‘భవదీయుడు భగత్ సింగ్’ పక్కన పెట్టారు. ఎన్నికల సన్నాహాలకు సమయం సరిపోదనే ఉద్దేశంతో ‘భగత్ సింగ్’ సినిమాని ఇప్పుడు వద్దనుకున్నారు.
‘హరి హర వీరమల్లు’ సినిమా కూడా అటకెక్కినట్లే అని టాక్ నడుస్తోంది. కానీ, ఈ సినిమాని ఆపే ఉద్దేశం పవన్ కళ్యాణ్ కి లేదు. అక్టోబర్, నవంబర్ లోపే సినిమాని పూర్తి చేసేలా డేట్స్ ఇవ్వడం విషయంలో ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతున్నారు. త్వరలోనే ఈ మూవీ గురించి క్లారిటీ వస్తుంది. సినిమా మొదలవ్వడం గ్యారెంటీ.
దర్శకుడు క్రిష్ ఈ సినిమా కథని మొఘల్ కాలం నేపథ్యంగా తీస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం 60 శాతం షూటింగ్ పూర్తి అయింది. మరో 40 శాతం తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు.
పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’తో పాటు ‘వినోదయ సితం రీమేక్’లో నటిస్తారు. ఎన్నికల లోపు ఆయన చేసే సినిమాలు ఇవి మాత్రమే.