
పవన్ కళ్యాణ్ రెండో ఇన్నింగ్స్ లో రీమేక్ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే, ‘వకీల్ సాబ్’ (‘పింక్’రీమేక్), ‘భీమ్లా నాయక్ (‘అయ్యపనం కోషియం’ రీమేక్) చిత్రాలు అలా పూర్తి చేశారు. మరోవైపు, “వినోదయా సితం” అనే తమిళ చిత్రం రీమేక్ లో నటించేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించాట్ట.
నటుడు, దర్శకుడు సముద్రఖని తీశాడు ఈ చిత్రాన్ని. ఆయనే తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఒక పాత్ర పోషించేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారట. ఐతే, ఇందులో పవన్ కల్యాణ్ హీరో కాదు. ఆయనది చిన్న పాత్ర.
ప్రధాన పాత్రలో సాయి తేజ్ నటిస్తాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఇది చిన్న చిత్రం. పవన్ కళ్యాణ్ కి పెద్దగా పని ఏమి ఉండదు. పది రోజుల్లో పూర్తిచేస్తారట. ఐతే, కథలో ఉన్న బలం కారణంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారట. ఇది కూడా స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలయితే వరుసగా మూడు రీమేక్ సినిమాలను వదిలినట్లు అవుతుంది.
ఐతే, పవన్ కళ్యాణ్ చేతిలో మరో రెండు భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. అవి స్ట్రేట్ చిత్రాలే. క్రిష్ తీస్తున్న ‘హరి హర వీరమల్లు’, హరీష్ శంకర్ తీసే ‘భవదీయుడు భగత్ సింగ్’ ఒరిజినల్ కథలే. రీమేకులు కాదు.