ఈ ఏడాది రెండూ రీమేకులే

Vakeel Saab

పవన్ కళ్యాణ్ అనేక సినిమాల్లో నటిస్తున్నాడు. దాదాపు అరడజన్ సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి షూటింగ్ పూర్తి చేసుకొంది. మరోటి 20 రోజుల షూటింగ్ జరుపుకొంది. ఇంకోటి ఇటీవలే పట్టాలెక్కింది. మరిన్ని సినిమాల్లో ఏవి ఎప్పుడు విడుదలవుతాయి? ఆ విషయంలో క్లారిటీ వచ్చినట్లే.

పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో రెండు మాత్రమే ఈ ఏడాది థియేటర్లలోకి వస్తాయి. అవే… ‘వకీల్ సాబ్’, ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్.

వకీల్ సాబ్… ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ పనులు అన్ని పూర్తి అయ్యాయి. ఇది బాలీవుడ్ లో సూపర్ హిట్టైన ‘పింక్’ చిత్రానికి రీమేక్. వకీల్ సాబ్ రిలీజైన నాలుగు, ఐదు నెలలకు విడుదలవుతుంది… అయ్యప్పన్ కోషియం’ రీమేక్.

ఇక క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుంది. హరీష్ శంకర్ డైరెక్క్షన్లో మొదలయ్యే సినిమా కూడా వచ్చే ఏడాది కానీ 2023 సంక్రాంతికి కానీ విడుదల కావొచ్చు. 2021లో మాత్రం పవన్ కళ్యాణ్ మనల్ని రీమేక్ చిత్రాలతోనే పలకరిస్తాడు.

More

Related Stories