- Advertisement -

మూడు నెలల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ యాక్టివ్ గా మారుతున్నారు. మళ్లీ రాజకీయ బాటలోకి వచ్చారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఉన్న కాలంలో రాజకీయాలు చేయొద్దనే ఉద్దేశంతో జనసేనాని మౌనం పాటించారు. ఐతే, ఇప్పుడు కరోనా రెండో వేవ్ పూర్తిగా తగ్గింది. ఆంధ్రాలో కర్ఫ్యూ సడలింపులు వచ్చాయి. ఆల్మోస్ట్ లాక్డౌన్ ఎత్తేసినట్లే.
సో… మంగళవారం (జులై 6) నుంచి విజయవాడలో జనసేన కార్యకలాపాలు షురూ.
అలాగే, పవన్ కళ్యాణ్ వచ్చే వారం నుంచి షూటింగ్ లో కూడా పాల్గొంటారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న “అయ్యపనం కోషియం” తెలుగు రీమేక్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేస్తారని టాక్.
కరోనా రెండో వేవ్ లో పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే. హైదరాబాద్ లోని ఫార్మ్ హౌజ్ లో ఉండి కరోనా చికిత్స తీసుకున్నారు.