
మరో మూడు నెలల వరకు పవన్ కళ్యాణ్ ఇక తన ఇంటి నుంచి బయటికి రాడు అనే విషయంలో అందరికి క్లారిటీ వచ్చింది. చాతుర్మాస్య దీక్షలో ఉన్నారాయన. రాజకీయ విమర్శలను ప్రెస్ నోట్స్, ట్వీట్స్ కి పరిమితం చేశారు కరోనా కారణంగా. బయటికి వచ్చి ఉద్యమాలు చేసే చెయ్యలేరు. ఇక సినిమా షూటింగ్ లు ఇప్పట్లో జరగవు. కేసులన్నా పూర్తిగా తగ్గుముఖం పట్టాలి…. లేదా వ్యాక్సిన్ అన్నా రావాలి. అంతవరకు, పవన్ కళ్యాణ్…స్టే హోమ్, స్టే సేఫ్ మార్గమే.
జనవరి వరకు మీ సినిమాకి డేట్స్ ఇవ్వలేను అని దర్శకుడు క్రిష్ కి చెప్పాడట. అందుకే… క్రిష్ ఇప్పుడు ఇంకో చిన్న సినిమా తీసుకుంటున్నాడు. రకుల్, వైష్ణవ్ తేజ జంటగా క్రిష్ డైరక్షన్ లో సినిమా మొదలైంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఒకటి… వకీల్ సాబ్. ఇది ఇంకా 30 రోజుల వర్క్ పూర్తి చేసుకోవాలి. డిసెంబర్ లో కానీ, జనవరి లో కానీ వకీల్ సాబ్ పనులు మొదలు పెట్టి… ఆ తర్వాత క్రిష్ సినిమా షురూ చేస్తారు. హరీష్ శంకర్ డైరక్షన్ లో ఒక మూవీ చెయ్యాలి. అన్ని అనుకున్నట్లు జరిగితే, అది 2021 చివర్లో మొదలవుతుంది.
ఇది పవన్ కళ్యాణ్ సినిమాల సీన్.