జనసేనాని సినిమా ప్రయాణం ఆగదు!

- Advertisement -
Pawan Kalyan


పవన్ కల్యాణ్ రెండు కాళ్ళ ప్రయాణం వల్ల ఇప్పటికే రాజకీయంగా నష్టపోయారు. 2019 ఎన్నికల సమయంలో చేసిన తప్పు ఈ సారి చెయ్యరు అనుకున్నాం. ఎన్నికలకు కనీసం ఏడాది ముందు సినిమాలు ఆపేసి పూర్తిగా పార్టీ కలాపాలు, రాజకీయాల మీదే దృష్టి పెడతారని విశ్లేషకులు భావించారు. దానికి తగ్గట్లే, హరీష్ శంకర్ సినిమాని పక్కన పెట్టారని ఆ మధ్య ప్రచారం జరిగింది.

కానీ, తన సినిమా ప్రయాణాన్ని ఆపేది లేదని పవన్ కల్యాణ్ తాజా చర్యలతో స్పష్టం చేస్తున్నారు.

ఈ రోజు దర్శకుడు సుజీత్ తో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. నిజానికి ఇది నిజంగా ‘కొత్త’ ప్రాజెక్ట్. సడెన్ గా వచ్చి చేరిందే. దీంతో పాటు, హరీష్ శంకర్ సినిమా కూడా మొదలు పెట్టనున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు విడుదలవుతాయి అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ, ఈ సినిమాలను ప్రకటించడం ద్వారా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేది లేదు. రాజకీయాలు, సినిమా కెరీర్ రెండూ కొనసాగుతాయి అని స్పష్టం చేసినట్లే.

ఇది ఆయనకి రాజకీయంగా ఇబ్బంది అవుతుందా లేదా అన్నది చూడాలి.

 

More

Related Stories