
జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ రాజకీయాలు గురించి ఎన్నో జోక్స్ ఉన్నాయి. మరోసారి… పవన్ కళ్యాణ్ అనాలోచిత స్టేట్ మెంట్స్ తో పరువు పోగుట్టుకున్నారు.
GHMC ఎన్నికల్లో జనసేన పోటీచేస్తామని హడావుడిగా ప్రకటించి, రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండి అక్కడ “సమీక్ష”లు జరిపారు పవన్ కళ్యాణ్. నిజంగా సీరియస్ గానే పోటీచేయాలనుకుంటే… ఆంధ్రప్రదేశ్ కార్యకలాపాలుకి బ్రేక్ ఇచ్చి వెంటనే హైదరాబాద్ పయనం అవ్వాలి. కానీ నామినేషన్ల ముగుంపుకి ఒక రోజు ముందు హైదరాబాద్ వచ్చి…. జనసేన తొలి జాబితా మరి కొద్దీ గంటల్లో అని ట్విట్టర్లో హడావుడి చేసి… చివరి రోజు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దాంతో జనసైనికులు ఇప్పుడు ఏమి చెప్పి కవరింగ్ ఇచ్చుకోవాలో సతమతమవుతున్నారు.
అసలు హైదరాబాద్ లో, తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీకి యంత్రాంగమే లేదు. బీజేపీతో ముందే చర్చలు జరపకుండా హడావిడిగా అనౌన్స్ చెయ్యడం ఏంటో, నామినేషన్ల ముగింపు చివరి రోజు బీజేపీ పెద్దలతో తాపీగా మాట్లాడుకోవడం ఏంటో, చివరికి “ఓట్లు చీలకుండా” తప్పుకుంటున్నాం అనడం ఏంటో అంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై ట్రోలింగ్ జరుగుతోంది.
ఐతే, బీజేపీకి పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించడం విశేషం. ఆయన ప్రచారంలో పాల్గొంటారు అని మీడియా వార్తలు చెప్తున్నాయి.