షాకిచ్చిన పవన్ కల్యాణ్

Pawan Kalyan

ఏటా పవన్ పుట్టినరోజును అభిమానులు పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆరోజున స్టార్స్ అంతా ట్విట్టర్ వేదికగా అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంటారు. అయితే ఎప్పుడూ పవన్ నుంచి రిప్లయ్ మాత్రం రాదు. అభిమానులు, ఇతర హీరోలు పవన్ నుంచి అది ఆశించరు కూడా. కానీ ఈసారి మాత్రం పవన్ షాకిచ్చారు.

తనకు శుభాకాంక్షలు తెలిపిన దాదాపు రాజకీయ, సినీప్రముఖులందరికి పవన్ రిప్లయ్ లు ఇచ్చారు. అలా రిప్లయ్ అందుకున్న కొందరికి షాక్ లు కూడా తగిలాయి.

ఉదాహరణకు కార్తికేయను తీసుకుందాం.. పవన్ ను దేవుడిగా ఫీల్ అయ్యే కార్తికేయ అందరు అభిమానుల్లానే తను కూడా బర్త్ డే ట్వీట్ పెట్టాడు. కానీ ఊహించని విధంగా రిప్లయ్ అందుకున్నాడు. పైగా పవన్ కల్యాణ్, కార్తికేయను “సర్” అని సంభోదించడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. రిప్లయ్ ఇవ్వడమే తనకు పెద్ద రిటర్న్ గిఫ్ట్ అన్నాడు.

సరిగ్గా ఇలాంటిదే సంపూర్ణేష్ బాబు విషయంలో కూడా జరిగింది. సంపూర్ణేష్ కు కూడా థ్యాంక్సు చెబుతూ “గారు” అనే పదం ఉపయోగించారు పవన్. దీంతో సంపూ ఆనందం పట్టలేకపోయాడు. పవన్ ట్వీట్ ను ఫొటో ఫ్రేమ్ కట్టించుకొని లైఫ్ లాంగ్ పెట్టుకుంటానని రీట్వీట్ చేశాడు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికి సమాధానాలు నిన్నటి నుంచి ఇస్తూనే ఉన్నాడు.

Related Stories