పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా?

Pawan Kalyan

లాక్ డౌన్ తో ఆగిపోయిన ”వకీల్ సాబ్” షూటింగ్ ఈమధ్యే మళ్లీ మొదలైంది. పవన్ కూడా సెట్స్ పైకి వచ్చేశారు. అయితే ఇప్పుడీ సినిమాకు మరోసారి బ్రేకులు పడబోతున్నాయి. ఈసారి కారణం జీహెచ్ఎంసీ ఎన్నికలు.

గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. వచ్చేనెల 1న పోలింగ్. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ తాజాగా నిర్ణయించింది. గ్రేటర్ పరిథిలో క్షేత్రస్థాయిలో ఉన్న జనసేన కార్యకర్తలు ఇప్పటికే ప్రజలతో మమేకమైపోయారని, వాళ్ల కోరిక మేరకు గ్రేటర్ ఎన్నికల బరిలో జనసేన నిలుస్తుందని ప్రకటించారు పవన్ కల్యాణ్.

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారానికి 13 రోజులు టైమ్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఈ 13 రోజుల్లో కనీసం 5 రోజులు పవన్ కల్యాణ్ ప్రచారం చేసేలా జనసేన రాజకీయ కమిటీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. వరుసగా 5 రోజుల పాటు ప్రచారం చేయాలా.. లేక మినిమం గ్యాప్స్ లో ప్రచారం చేయాలా అనే అంశాలపై కసరత్తు మొదలైంది.

నిజానికి ఈ నెలాఖరుకు ”వకీల్ సాబ్’ షూట్ ను పూర్తిచేయాలనుకున్నారు పవన్. వచ్చే నెల నిహారిక పెళ్లి ఉంది. ఆ టైమ్ కు సినిమా పూర్తిచేసి, పెళ్లి తర్వాత క్రిష్ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ తో ”వకీల్ సాబ్” షూటింగ్ కు మరికొన్ని రోజులు బ్రేకులు పడేలా ఉంది.

Related Stories