
GHMC ఎన్నికల్లో జనసేన పార్టీ …మిత్రపక్షం బీజేపీకి సపోర్ట్ చేస్తోంది. ఇప్పటికే, జనసేన కార్యకర్తలు హైదరాబాద్ గల్లీలలో కమలం పార్టీ జెండాలతో తమ జెండాలను కూడా ఎగరేస్తున్నారు. బీజేపీ దేశంలో ఉన్న తమ పార్టీ బడా లీడర్లందరిని హైదరాబాద్ రోడ్లపైకి తీసుకొస్తోంది ప్రచారం కోసం. అలాగే, పవన్ కళ్యాణ్ ని కూడా ప్రచారంలోకి దించితే కొన్ని పాకెట్స్ లో అయినా కొంత బెనిఫిట్ ఉంటుంది అని భావిస్తోంది.
మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రచార బరిలోకి దిగుతాడనేది చూడాలి. ప్రస్తుతం జనసేనాని ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడ బీజేపీ పెద్దలతో చర్చలు జరిపిన తర్వాత ఒక క్లారిటీ వస్తుందేమో. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశాడు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కాంగ్రెస్-టీడీపీ కూటమికి మద్దతిచ్చాడు. రెండూ సార్లు టీఆరెస్ దే గెలుపు.
ఐతే, ఇప్పుడు హైదరాబాద్ వరదల టైములో టీఆరెస్ ప్రభుత్వం సరిగా హ్యాండిల్ చెయ్యలేదు అన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇది తమకు బాగా కలిసొస్తోంది అని బీజేపీ భావిస్తోంది. సో.. పవన్ కళ్యాణ్ మరి బీజేపీ కూటమికి ఎంతవరకు హెల్ప్ అవుతాడో చూడాలి.