ఫాన్స్ కి పండగ

Pawan Kalyan

“చూడప్పా సిద్ధప్పా.. నేను సింహంలాంటోడ్ని. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్.” ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సూపర్ హిట్ డైలాగ్ ఇది. ఇప్పుడీ డైలాగ్ ను పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఎందుకంటే.. పవన్ నిజంగానే గడ్డం గీశాడు కాబట్టి.

అవును.. సుదీర్ఘ విరామం తర్వాత పవన్ తన గడ్డానికి గుడ్ బై చెప్పేశాడు. ఇన్నాళ్లూ చాతుర్మాస దీక్షలో ఉన్న కారణంగా జుట్టు, గడ్డం తీయలేదు. నిజంగానే “బాబా పవన్”గా మారిపోయాడు. తాజాగా దీక్ష పూర్తవ్వడంతో జుట్టు కత్తిరించాడు. గడ్డం ట్రిమ్ చేశాడు.

చాన్నాళ్ల తర్వాత గుబురు గడ్డం, దట్టమైన జుట్టు లేకుండా, మళ్లీ నార్మల్ లుక్ లో పవన్ ను చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి, పవన్ తో దిగిన ఫొటోల్ని షేర్ చేయడంతో ఈ మేటర్ బయటకొచ్చింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు.

Related Stories