ఇక పవనోత్సవం అంట!

- Advertisement -
Pawan Kalyan

పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తమ సత్తా చూపిస్తుంటారు. సోషల్ మీడియాలో వీరి శక్తి ముందు తెరాస, వైఎస్సార్సీ, టీడీపీ పార్టీలు దిగదుడుపే. అందుకే… ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోకి రకరకాల టాపిక్ లు తెస్తుంటారు వీళ్ళు. ఈ రోజు (జులై 13) ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు ట్రెండ్ చేస్తున్న హాష్ టాగ్ – #పవనోత్సవం.

ఇంతకీ ఏంటి ఉత్సవం అంటే… పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కోసం జరుగుతున్న హడావిడి. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే. దానికి కౌంట్ డౌన్ గా రేపటి నుంచి రకరకాల ట్వీట్లు వేస్తారట. దానికి పెట్టిన పేరు… పవనోత్సవం.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు ఒప్పుకున్నారు. అందులో రెండు సెట్స్ పై ఉన్నాయి. మరోటి ప్రారంభం కావాలి. ఈ రోజు నుంచి ఆయన ‘అయ్యపనం కోషియం’ రీమేక్ షూటింగ్ లో పాల్గొనాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ వాయిదా పడింది. ఈ వీకెండ్ లేదా వచ్చే వారం కానీ షూటింగ్ మొదలవ్వొచ్చు.

మరోవైపు, క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ వచ్చే నెల షురూ అవుతుంది.

More

Related Stories