
తనని లక్ష్యంగా చేసుకొని ఏకంగా తెలుగు సినిమా పరిశ్రమ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేధిస్తోంది అని పవన్ కళ్యాణ్ ఘాటుగా విమర్శించడం కలకలం రేపింది. ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం రాజకీయ గులాబ్ తుపాన్ సృష్టించింది.
తాజాగా నటుడు పోసాని కృష్ణ మురళి కూడా పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వాడిన భాష అభ్యంతరకరంగా ఉందంటూ తనదైన శైలిలో మాట్లాడారు పోసాని. అంతేకాదు, పవన్ కళ్యాణ్ ఒక పని చేస్తే ఆయనికి గుడి కడుతాను అంటూ ఒక పంజాబీ హీరోయిన్ ప్రస్తావన తీసుకొచ్చారు. సుదీర్ఘంగా సాగిన పోసాని ప్రసంగం ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పంచులు వేశారు.
“తుమ్మెదల ఝుంకారాలు
నెమళ్ళ క్రేంకారాలు
ఏనుగుల ఘీంకారాలు
వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే …” అంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.
అంతేకాదు, 20 ఏళ్ల క్రితం విడుదలైన సూపర్ హిట్ పాప్ సాంగ్ “హూ లెట్ ది డాగ్స్ అవుట్” (ఈ కుక్కలను బయటికి ఎవరు వదిలారు) అనే పాట యూట్యూబ్ లింక్ ని పోస్ట్ చేశారు. ఈ పాట తనకి బాగా ఇష్టమంటూ పవన్ పంచ్ పడింది.